రేణుక కేశరమడు
రేణుక కేశరమడు | |
---|---|
జననం | 1957 (age 66–67) తుమ్మకూరు, కర్ణాటక, భారతదేశం |
జాతీయత | భారతీయురాలు |
ఎన్నిక | కర్ణాటక లలిత కళా వైభవ్ |
రేణుక కేశరమడు కర్ణాటక కు చెందిన చిత్రాకారిణి, శిల్పి.[1]
జననం, విద్యాభ్యాసం
[మార్చు]ఈమె 1957 లో కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లాలోని తుమకూరు నగరానికి సమీపంలో ఉన్న కేసరమడు గ్రామంలో జన్మించింది. ఈమె కర్ణాటక చిత్రకళ పరిషత్ నుండి ఆర్ట్ హిస్టరీలో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (ఎంఎఫ్ఎ), చెన్నైలోని అన్నామలై విశ్వవిద్యాలయం నుండి చరిత్రలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (ఎంఏ), బెంగళూరు విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బిఎస్సి) విద్యను పూర్తి చేశారు.[2]
సోలో ఎగ్జిబిషన్
[మార్చు]ఈమె భారతదేశంలో తన సోలో ఎగ్జిబిషన్లను గోవా లోని లలిత్ కాలా అకాడమీ, ముంబై లోని బజాజ్ ఆర్ట్ గ్యాలరీ, చెన్నై లోని లలిత్ కాలా అకాడమీ, తుమ్కూర్ లోని కల్ప కుంచా ఆర్ట్ గ్యాలరీ, మైసూర్ లోని చమరాజేంద్ర అకాడమీ ఆఫ్ విజువల్ ఆర్ట్స్, కర్ణాటక చిత్రాల పరిషత్, ఫ్రాంఛైజ్ ది బెంగళూరు, బెంగళూరులోని వెంకటప్ప ఆర్ట్ గ్యాలరీలలో తన సోలో ప్రదర్శలను ప్రదర్శించారు.[3] ఈమె తన సోలో ఆర్ట్ ప్రదర్శనలను మన భారతదేశంలోనే కాకుండా ఫిన్లాండ్, రొమేనియా లోని బాకులో, హోవింకార్టానోలోని మ్యాగజైన్ గ్యాలరీలో, హౌహో, హమీన్‌లిన్నాలోని తైడెగల్లెరియా రిపస్టస్, హెల్సింకిలోని కైసా ఇంటర్నేషనల్ కల్చరల్ సెంటర్ వంటి గ్యాలరీలు తన సోలో ప్రతిభను ప్రదర్శించారు.[4]
బృంద ప్రదర్శన
[మార్చు]ఈమె తన బృంద ప్రదర్శనలను భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా ఇటలీలోని నాపోలి, మిలానో, టొరినో, కార్సికో, వెర్సెల్లి, స్కాంపియా, రోవెరెటోల వంటి ప్రదేశాల్లో, ఫిన్లాండ్‌లోని కంగసాలా, రెంకో, హోవింకార్టానో, హమీన్లిన్నా, సీనాజోకిలలో వంటి ప్రదేశాల్లో, జకార్తా (ఇండోనేషియా), న్యూయార్క్ (అమెరికా), స్లోవేకియా, సావో పాలో (బ్రెజిల్), శాంటియాగో (స్పెయిన్) ఘనా (పశ్చిమ ఆఫ్రికా) వంటి పలు అంతర్జాతీయ నగరాల్లో తన ప్రదర్శనలను ప్రదర్శించారు.[5] భారతదేశంలో కర్ణాటక చిత్రకళ పరిషత్, ఆర్ట్ హౌజ్, సుస్తి ఆర్ట్ గ్యాలరీ, బెంగళూరు ఆర్ట్ గ్యాలరీ, లక్షనా ఆర్ట్ గ్యాలరీ, బెంగళూరులోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్, గుఫా ఆర్ట్ గ్యాలరీ, రాజ్‌పథ్ క్లబ్ గోల్డెన్ హాల్, ఆర్ట్ చాలెట్, కాంటెంపరరీ ఆర్ట్ గ్యాలరీ, అహ్మదాబాద్‌లోని మార్వెల్ ఆర్ట్ గ్యాలరీ, చెన్నైలోని వాల్యూస్ గ్యాలరీ, లలిత్ కాలా అకాడమీ, ఆర్టిస్ట్ సెంటర్, నెహ్రూ ఆర్ట్ సెంటర్, ముంబైలోని మ్యూజియం గ్యాలరీ, ఢిల్లీ లోని ఆర్ట్ మాల్, హైదరాబాద్ లోని శ్రీస్టి ఆర్ట్ గ్యాలరీ వంటి నగరాల్లో తన బృంద చిత్ర ప్రదర్శనను ప్రదర్శించారు..[6]
పురస్కారాలు
[మార్చు]ఈమె జాతీయ స్థాయిలో అనేక పురస్కారాలు గెలుచుకుంది. అందులో
- 1993 లో బెంగళూరులో కర్ణాటక చిత్రకాల పరిషత్ ఆల్ ఇండియా ఆర్ట్ కాంపిటీషన్ పురస్కారం.
- 1987, 1988, 1989 లో ముంబైలోని భారతీయ శిక్షన్ మండల్ ఆల్ ఇండియా ఆర్ట్ కాంపిటీషన్ పురస్కారం
- 1992 లో మైసూర్ నిర్వహించిన ఆల్ ఇండియా ఆర్ట్ కాంపిటీషన్
- 2009 లో బీజాపూర్‌లో జరిగిన ఆల్ ఇండియా ఆర్ట్ కాంపిటీషన్
- 1994 లో తుమకూరులో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం
- 1993 లో తుమకూరులో కన్నడ రాజ్యోత్సవ పురస్కారం
- 1999 లో తుమకూరులో రోటరీ క్లబ్ చేత రోటరీ పురస్కారం
మరిన్ని విశేషాలు
[మార్చు]భారతదేశంలోని తుమకూరులో శ్రీ శివకుమార స్వామీజీ శతాబ్ది జయంతిని పురస్కరించుకుని సిద్ధగంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 'ఆర్ట్-రేస్' అనే పేరుతో అంతర్జాతీయ ఆర్ట్ సింపోజియం నిర్వహించింది. ఈమె మంగుళూరు, బీజాపూర్, మైసూర్ వంటి నగరాల్లో జాతీయ స్థాయి శిబిరాలు, బెంగళూరు, బీదర్, తుమ్కూర్, బిలాగి, , రామనగర్, దొడ్డబల్లపూర్, మైసూర్ వంటి నగరాల్లో రాష్ట్ర స్థాయి శిబిరాలు నిర్వహించి తన ప్రతిభను చాటారు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఈమె బి ఎస్ మల్లికార్జునను వివాహమాడింది. ఈయన సంగీతకారుడు, నాటక నటుడు.
మూలాలు
[మార్చు]- ↑ "La Salle Scampia: RENUKA KESARAMADU". Archived from the original on 11 అక్టోబరు 2019. Retrieved 11 October 2019.
- ↑ "Renuka Kesaramadu". Google. Archived from the original on 10 ఫిబ్రవరి 2017. Retrieved 11 October 2019.
- ↑ www-palvelut, LimeNet. "Taidegalleria Ripustus – Pirjo Heino". ripustus.fi. Archived from the original on 1 సెప్టెంబరు 2019. Retrieved 11 October 2019.
- ↑ "Solo Shows – Renuka Kesaramadu". Google. Archived from the original on 27 అక్టోబరు 2020. Retrieved 11 October 2019.
- ↑ "Kirjataidenäyttey – Hämeenlinnan kaupunginkirjasto 2015". kirjasto.hameenlinna.fi. Archived from the original on 20 ఏప్రిల్ 2016. Retrieved 11 October 2019.
- ↑ "Group Shows – Renuka Kesaramadu". Google. Archived from the original on 27 అక్టోబరు 2020. Retrieved 11 October 2019.